Anantapur: అనంతపురంలో ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్ 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం!

Anantapur: అనంతపురం వన్‌టౌన్ పోలీసులు ఇద్దరు బైక్ దొంగలను అరెస్ట్ చేశారు. రూ. 9 లక్షల విలువైన 18 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కరుణాకర్ రావు తెలిపారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 13 Oct 2026 6:39 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్ 18 మోటార్ సైకిళ్లు స్వాధీనం!

అనంతపూర్: అనంతపురం నగరంలో మోటార్ సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 9 లక్షల రూపాయల విలువైన 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రానికి చెందిన బెస్త రామాంజనేయులు, తాడిపత్రికి చెందిన బోయ అంజన్ కుమార్ ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన మోటార్ సైకిళ్లను కర్ణాటకకు తరలించే సమయంలో పోలీసులు నిఘా ఉంచి దాడులు నిర్వహించారు.

వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. కరుణాకర్, సబ్‌ఇన్‌స్పెక్టర్ కే.సి. తిరుపాల్ ప్రత్యేక బృందంతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు.ఈ క్రమంలో ఇద్దరు నిందితులను మోటార్ సైకిళ్లతో సహా పట్టుకున్నారు. ఈ వివరాలను డీఎస్పీ పి. కరుణాకర్ రావు వెల్లడించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM