Anantapur: అనంతపురంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి. అక్టోబర్ 16 నుంచి 30 వరకు ఎన్నికల ప్రక్రియ వివరాలను వెల్లడించిన కమిషనర్ జస్వంతరావు.
Anantapur: అనంతపురంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల!
Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన మేయర్ అభ్యర్థులు, కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుంటున్నారు.ఈనెల 16 నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ 30వ తేదీతో ముగియనుందని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ రావు వెల్లడించారు.
ఈనెల 18వ తేదీ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు.19వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన నిర్వహించనుండగా, 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.ఈనెల 28వ తేదీన నగర పరిధిలో పోలింగ్ బూత్లను ఖరారు చేయనున్నారు.
29వ తేదీన ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉంటుందని కమిషనర్ వెల్లడించారు.చివరగా ఈనెల 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తికానుందని జస్వంత్ రావు తెలిపారు.




