Anantapur: అనంతపురం మేయర్గా రమేష్ గౌడ్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం!
Anantapur: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా వైసీపీ నేత రమేష్ గౌడ్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
Anantapur: అనంతపురం మేయర్గా రమేష్ గౌడ్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం!
అనంతపురం: గత నెలలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రమేష్ గౌడ్ గెలుపొందడం జరిగినది. ఈ క్రమంలో ఈ దినము మున్సిపల్ కార్పొరేషన్ నందు మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రమేష్ గౌడ్ తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా గెలుపొందిన వారు.
ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అనంతపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తరువాత మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పార్టీ కండువా మేయర్ అభ్యర్థికి రమేష్ గౌడ్ కి వేసి అక్కడి నుంచి సీనియర్ నాయకులు ఇతర కార్యకర్తలతో భారీ ర్యాలీతో బయలుదేరి మున్సిపల్ కార్యాలయం చేరుకోవటం జరిగింది.




