Anantapur: అనంతపురం మేయర్ బరిలో వైసీపీ అభ్యర్థి రమేష్ ముమ్మర ప్రచారం!

Anantapur: అనంతపురం నగర అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ అన్నారు. పాత ఊరు, బంగారు వీధి ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 22 Oct 2026 4:43 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం మేయర్ బరిలో వైసీపీ అభ్యర్థి రమేష్ ముమ్మర ప్రచారం!

అనంతపురం: అనంతపురం నగర అభివృద్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ మేయర్ అభ్యర్థి బీసీ రమేష్ గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అనంతపురం నగరంలోని బంగారు వీధి, పాత ఊరు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుంటూ, నగర అభివృద్ధి జరగాలంటే వైఎస్సార్‌సీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. నగర ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఇక పక్కన ఉన్న నియోజకవర్గాల నుంచి మంత్రులు, ఇతర నాయకులు వచ్చి అనంతపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీసీ రమేష్ గౌడ్ ఆరోపించారు.

రెండున్నర సంవత్సరాలైనా ధర్మవరాన్ని అభివృద్ధి చేయలేనటువంటి మంత్రి అనంతపురంలో ఏమీ అభివృద్ధి చేస్తారని బిసి రమేష్ గౌడ్, ఘాటుగా మాట్లాడారు.అనంతపురం నగర అభివృద్ధి కోసం ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని, వైఎస్సార్‌సీపీని ఆదరించి గెలిపించాలని ఆయన కోరారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM