Anantapur: అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ నామినేషన్!
Anantapur: అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బిసి రమేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. 62 డివిజన్లలో పార్టీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Anantapur: అనంతపురం వైసీపీ మేయర్ అభ్యర్థిగా రమేష్ గౌడ్ నామినేషన్!
అనంతపురం: అనంతపురం నగర మేయర్ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రమేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం నగరంలో ఉన్నటువంటి సమస్యలను తీరాలంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేరభ్యర్థి రమేష్ గౌడ్ తెలిపారు.
నగరాన్ని కాపాడుకోవాలంటే నగరంలోని 62 డివిజన్ల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడ్డానని, ఇప్పుడు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం వచ్చిందని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలు తనకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని వర్గాల ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించే పరిస్థితులు ఉండాలని ఆకాంక్షించారు. మేయర్ స్థానంతో పాటు నగరంలోని 62 డివిజన్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని రమేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.




