Anantapur: వైసీపీపై ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్ర విమర్శలు!

Anantapur: అనంతపురంలో వైసీపీ గెలుస్తుందని అనంత పగటి కలలు కంటున్నారని, 62 డివిజన్లలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 29 Oct 2026 12:39 PM IST
Anantapur
X

Anantapur: వైసీపీపై ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్ర విమర్శలు!

Anantapur: అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పగటి కలలు కంటున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నగరంలోని 13వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కుర్లపల్లి విజయ్ కుమార్ తరఫున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఓ టీ కొట్టులో స్వయంగా టీ తయారు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం 12, 8, 2వ డివిజన్లలోనూ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 15 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించామని తెలిపారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో నగర అభివృద్ధి పూర్తిగా శూన్యమని విమర్శించారు.గతంలో వైసీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.ఇప్పుడు కూడా ఎన్నికలను అడ్డుకోవడం ద్వారా నగర అభివృద్ధిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

నాలుగుసార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంత వెంకట్రామిరెడ్డి నగరానికి చేసిన అభివృద్ధి ఏమిటని దగ్గుపాటి ప్రశ్నించారు. వంకర రోడ్లు వేయించడం, తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయించుకోవడం మినహా నగరానికి చేసిందేమీ లేదని విమర్శించారు.కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ బాబు గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో అనంతపురం నగరానికి ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే జంక్షన్‌తో పాటు చెరువు కట్టపై ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మేయర్ స్థానంతో పాటు మొత్తం 62 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM