Anantapur: అనంతపురంలో జోరుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం
Anantapur: అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాజేష్‌ను గెలిపించాలని కోరారు.
Anantapur: అనంతపురంలో జోరుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం
Anantapur: అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా ఐదు, ఆరు, 17, 18వ డివిజన్లలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కమలానగర్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి రాజేష్‌కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
కమలానగర్లో సుమారు మూడున్నర కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని నవంబర్ ఒకటో తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబుతో పాటు, అన్ని డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులకు ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నట్లు దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.




