Anantapur: అనంతపురంలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం!

Anantapur: అనంతపురంలో కూటమి ఎన్నికల ప్రచారం షురూ. బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థి సంగీత విజయం కోసం మంత్రి సత్యకుమార్ ఇంటింటి ప్రచారం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 19 Oct 2026 1:49 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం!

Anantapur: అనంతపురం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.కూటమి పార్టీల నాయకులు ఎన్నికల ప్రచార భేరి మోగించారు. బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌కు మద్దతుగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రచారాన్ని ప్రారంభించారు.

ముందుగా 48వ డివిజన్‌లోని లక్ష్మీనగర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి సత్యకుమార్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సంయుక్తంగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థి సంగీతను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఓటమి భయంతోనే గంజాయి బ్యాచ్‌లు, పంజాబ్‌కు చెందిన కిరాయి ముఠాలను తీసుకొచ్చి రాష్ట్రంలో మళ్లీ ఫ్యాక్షన్ కక్షలు, గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. తన ద్వంద్వ వైఖరిని విడనాడి ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు.అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే 1,300 కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అనంతపురం నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తామని స్పష్టం చేశారు.ఇక బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం యువతను అక్రమ దందాల వైపు నడిపించి వారి జీవితాలను నాశనం చేసిందని విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సామాన్య యువకుడినైన తనకు కూటమి నాయకత్వం మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిందన్నారు.ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే అనంతపురం నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి నగర రూపురేఖలను మారుస్తామని హామీ ఇచ్చారు.మొత్తంగా అనంతపురం నగరంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముఖ్య నాయకులు రంగంలోకి దిగడంతో ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM