Anantapur: టౌన్ నూతన డీఎస్పీగా కరుణాకర్ రావు బాధ్యతల స్వీకరణ
Anantapur: అనంతపురం టౌన్ నూతన డీఎస్పీగా కరుణాకర్ రావు బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచుతామని ఆయన వెల్లడించారు.
Anantapur: టౌన్ నూతన డీఎస్పీగా కరుణాకర్ రావు బాధ్యతల స్వీకరణ
అనంతపూర్: అనంతపురం టౌన్ నూతన డీఎస్పీగా కరుణాకర్ రావు బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎంపికైన ఆయన, అనంతరం ప్రకాశం జిల్లా పరిధిలో కొంతకాలం సీఐగా విధులు నిర్వహించారు.
తాజాగా గుంటూరు జోన్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందారు.డీజీపీ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కరుణాకర్ రావు సోమవారం అనంతపురం టౌన్ డీఎస్పీగా వచ్చి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపురం ప్రాంతానికి తాను పూర్తిగా కొత్తవాడినని తెలిపారు. స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకుంటూ, ఇక్కడి సిబ్బంది, ఉన్నతాధికారుల సూచనలు తీసుకుని విధులు నిర్వహిస్తానన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను మరింత పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని నూతన డీఎస్పీ కరుణాకర్ రావు తెలిపారు.




