Kalyandurg: ఎన్నికల హామీ అమలు.. మారెంపల్లి కాలనీకి తాగునీటి సదుపాయం!

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మారెంపల్లి కాలనీలో ఎన్నికల హామీ మేరకు ఎస్సార్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధజల కేంద్రాన్ని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 19 Nov 2026 11:58 AM IST
Kalyandurg
X

Kalyandurg: ఎన్నికల హామీ అమలు.. మారెంపల్లి కాలనీకి తాగునీటి సదుపాయం!

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో మారెంపల్లి కాలనీ ప్రజలు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తాగునీటి సమస్యను తీసుకువచ్చారు. 8వ, 9వ వార్డుల పరిధిలోని కాలనీలో గతంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే, ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్సార్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో కాలనీలో ఉచిత శుద్ధజల కేంద్రం ఏర్పాటు చేయించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మారెంపల్లి కాలనీలో ఏర్పాటు చేసిన ఉచిత శుద్ధజల కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. మున్సిపల్ చైర్మన్ బుట్నా లక్ష్మీ తిమ్మరాజు, స్థానిక కౌన్సిలర్లు సునీత సంగప్ప, వనం అమృతతో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కోరిన తాగునీటి సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో కాలనీవాసులకు శుద్ధమైన నీరు అందించే కేంద్రం అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలందరినీ కలుపుకొని కళ్యాణదుర్గంను సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వెల్లడించారు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam