Guntakal: కూటమి ప్రభుత్వంతోనే గుంతకల్లు అభివృద్ధి: పవన్ గౌడ్!

Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీలో కూటమి చైర్మన్ అభ్యర్థి యశోద గౌడ్, కౌన్సిలర్ల గెలుపు కోసం బీసీ సెల్ అధికార ప్రతినిధి పవన్ గౌడ్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 29 Oct 2026 5:30 PM IST
Guntakal
X

Guntakal: కూటమి ప్రభుత్వంతోనే గుంతకల్లు అభివృద్ధి: పవన్ గౌడ్!

గుంతకల్లు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, గుంతకల్లు మున్సిపాలిటీలో కూటమి చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి, యువనేత పవన్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ప్రచారంలో భాగంగా 40వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రభాకర్, 44వ వార్డు అభ్యర్థి సంజీవ్, 45వ వార్డు అభ్యర్థి షేక్ రిజ్వాన్‌లతో కలిసి ఆయా వార్డుల్లో పవన్ గౌడ్ పర్యటించారు. గుంతకల్లు టీడీపీ చైర్మన్ అభ్యర్థి యశోద గౌడ్‌కు, వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పవన్ గౌడ్ మాట్లాడుతూ, గుంతకల్లు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. చైర్మన్ అభ్యర్థి యశోద గౌడ్‌తో పాటు ఆయా వార్డుల కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి, సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో విష్ణు తేజ్ గౌడ్‌తో పాటు 40, 44, 45వ వార్డులకు చెందిన టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL