Anantapur: గుమ్మగట్ట కేజీబీవీలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో దాదాపు 25 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని పీహెచ్‌సీకి తరలించారు.
Anantapur: గుమ్మగట్ట కేజీబీవీలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు!
అనంతపురం: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేజీబీవీలో దాదాపు 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




