Anantapur: నామినేషన్ల తొలిరోజే టీడీపీ రక్తపాతానికి తెరలేపింది
Anantapur: అనంతపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నామినేషన్ల తొలిరోజే టీడీపీ నేతలు హింసకు తెరలేపారని, మిథున్ రెడ్డిపై దాడి అప్రజాస్వామికమన్నారు.
Anantapur: నామినేషన్ల తొలిరోజే టీడీపీ రక్తపాతానికి తెరలేపింది
అనంతపూర్: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే రాష్ట్రంలో దాడులు చోటుచేసుకోవడం ఆందోళనకరమని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
టీడీపీ నాయకులు రక్తపాతానికి తెరలేపుతున్నారని ఆయన విమర్శించారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
రాయచోటిలో వైసీపీ నాయకుల వాహనాలపై దాడులు చేయడం దుర్మార్గమని విమర్శించారు.ధర్మవరంలో అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కోరారు.




