Anantapur: ఓవర్‌లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న ఐదు లారీలు సీజ్!

Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎల్లనూరు వైపు నుంచి ఓవర్‌లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న ఐదు లారీలను తాడిపత్రి రూరల్ పోలీసులు సీజ్ చేసి ఎంవీఐకి అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Nov 2026 4:08 PM IST
Anantapur
X

Anantapur: ఓవర్‌లోడ్‌తో ఇసుక రవాణా చేస్తున్న ఐదు లారీలు సీజ్!

అనంతపురం: ఈ రోజు ఉదయం ఎల్లనూరు వైపు నుండి తాడిపత్రి పట్టణానికి అధిక లోడుతో (ఓవర్‌లోడ్) ఇసుకను రవాణా చేస్తున్న ఐదు లారీలను తాడిపత్రి రూరల్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, సదరు ఐదు లారీలను సీజ్ చేసి.

తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం తాడిపత్రి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) వారికి అప్పగించారు. వాహనదారులు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలను నడిపితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని CI నారాయణ రెడ్డి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్