Anantapur: తాడిపత్రి మండల ఎంపీపీగా కంచంరెడ్డి సుష్మ ఏకగ్రీవ ఎన్నిక!
Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిషత్ అధ్యక్షురాలిగా కంచంరెడ్డి సుష్మ 15 మంది ఎంపీటీసీల సంపూర్ణ మద్దతుతో గురువారం ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.
Anantapur: తాడిపత్రి మండల ఎంపీపీగా కంచంరెడ్డి సుష్మ ఏకగ్రీవ ఎన్నిక!
అనంతపురం: తాడిపత్రి MPDO కార్యాలయంలో MPTC అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ అనంతరం మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులను 15 మంది ఎంపీటీసీల అభ్యర్థుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎంచుకున్నారు. తాడిపత్రి మండల అధ్యక్షురాలుగా 15 మంది mptc లు కలిసి కంచంరెడ్డి సుష్మ ను ఎన్నుకున్నారు. అనంతరం మండల అధ్యక్షులు కంచంరెడ్డి సుష్మ అధికారుల సమక్షంలో డిక్లేషన్ ఫామ్ అందించిన అధికారులు అనంతరం సుష్మ ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సుష్మ HM TV తో మాట్లాడుతూ మండల పరిషత్ అధ్యక్షురాలుగా పదవిని వచ్చేలా సహకరించిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామానికి 15 మంది mptc తో కలిసి తమ వంతు సహకారం చేస్తానని తెలిపారు.




