Pamidi: పామిడి నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు!
Pamidi: అనంతపురం జిల్లా రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పామిడి మండలంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు బి. స్మరణ్ రాజ్, ఐఏఎస్ పరిశీలించారు.
Pamidi: పామిడి నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు!
పామిడి: అనంతపురం జిల్లాలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పామిడి మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీ బి. స్మరణ్ రాజ్, ఐఏఎస్ (B. Smaran Raj, IAS) పరిశీలించారు.
ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను, ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను, సంబంధిత రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, ఎన్నికల నియమావళికి అనుగుణంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు జిల్లా ఎన్నికల పరిశీలకులు ఆదేశించారు.




