Anantapur: అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరులకు ఘన నివాళి!
Anantapur: అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ ఆనంద్, డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు.
Anantapur: అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరులకు ఘన నివాళి!
Anantapur: పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో అమర పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు.
జిల్లా కలెక్టర్ ఆనంద్, డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ జగదీష్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ప్రజల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఎన్నికల సమయంలోనూ శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు పోలీసులు కీలకంగా పనిచేస్తారని పేర్కొన్నారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలు ఎప్పటికీ మరువలేనివని కలెక్టర్ అన్నారు.అమర పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.




