Anantapur: అనంతపురం 33వ డివిజన్‌లో నారాయణమ్మ ప్రచారం
Anantapur: అనంతపురం 33వ డివిజన్ టీడీపీ అభ్యర్థి గుండ్లమడుగు నారాయణమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించి, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతు కోరారు.
Anantapur: అనంతపురం 33వ డివిజన్‌లో నారాయణమ్మ ప్రచారం
అనంతపురం: అనంతపురం నగరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగా 33వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గుండ్లమడుగు నారాయణమ్మ నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని టీడీపీ నాయకుడు బుగ్గయ్య చౌదరి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో గత రెండున్నరేళ్లుగా అనంతపురం నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందన్నారు.ప్రచారంలో భాగంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ నారాయణమ్మకు హారతులతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.
మరోవైపు, కార్పొరేటర్ అభ్యర్థి గుండ్లమడుగు నారాయణమ్మ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనకు ప్రజల్లో ఆదరణ పెంచాయని అన్నారు.33వ డివిజన్ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు కమలం గుర్తుపై, అలాగే కూటమి బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థులకు తమ తమ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.




