Anantapur: బొమ్మనహాల్ పంచాయతీ నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఏఆర్ డీఎస్పీ!

Anantapur: అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఏఆర్ డీఎస్పీ సందర్శించి పోలీస్ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 17 Nov 2026 12:34 PM IST
Anantapur
X

Anantapur: బొమ్మనహాల్ పంచాయతీ నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన ఏఆర్ డీఎస్పీ!

అనంతపురం: ఈరోజు బొమ్మనహాల్ మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా, మండలంలోని అన్ని నామినేషన్ కేంద్రాలను గౌరవ ఏఆర్ డీఎస్పీ గారు సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు, కేంద్రాల వద్ద భద్రతా చర్యలు, శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించారు.

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో స్థానిక పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM