Anantapur: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
Anantapur: అనంతపురం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి; పాలిటెక్నిక్ కళాశాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సామాగ్రి, సిబ్బంది.
Anantapur: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
అనంతపురం: అనంతపురం జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు జరగనున్న పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని పంచాయతీలకు ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర ఎన్నికల సామగ్రిని ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఎన్నికల విధుల కోసం నియమితులైన సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది.
మరోవైపు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మొత్తానికి... రేపు జరగనున్న పోలింగ్‌తో పల్లె పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. తమ గ్రామానికి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు.




