Anantapur: నా ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవకురాలుగా పనిచేస్తా
Anantapur: అనంతపురం అర్బన్ 25వ డివిజన్ కార్పొరేటర్‌గా సోనియా ఆర్ ప్రమాణ స్వీకారం; ఊపిరి ఉన్నంతవరకు డివిజన్ ప్రజలకు సేవకురాలుగా పనిచేస్తానని హామీ.
Anantapur: నా ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవకురాలుగా పనిచేస్తా
అనంతపూర్: అనంతపురం అర్బన్ నియోజకవర్గం 25 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయం సాధించడంతో నేడు మున్సిపల్ కార్యాలయం నందు సోనియా ఆర్ ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం చేశారు..ముందుగా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణ స్వీకారం చేశారు.. ఇంతటి గొప్ప కార్యక్రమానికి నన్ను గెలిపించి పంపించిన 25వ డివిజన్ ప్రజలకు చేతులెక్కి నమస్కరిస్తున్న అన్నారు.
డివిజన్ ప్రజలకు నా ఊపిరి ఉన్నంతవరకు రుణపడి ఉంటానని కార్పొరేటర్ సోనియా ఆర్ తెలిపారు... ఇంతటి విజయానికి సహకరించిన డివిజన్ ప్రజలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి,అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారికి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.




