Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు తొలిరోజు 16 నామినేషన్లు దాఖలు!

Anantapur: అనంతపురం కార్పొరేషన్‌లో తొలిరోజు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నుంచి 12, వైసీపీ నుంచి 4 రాగా, మేయర్ పదవికి ఒక్క నామినేషన్ కూడా రాలేదు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 16 Oct 2026 6:21 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు తొలిరోజు 16 నామినేషన్లు దాఖలు!

అనంతపూర్: అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈరోజు మేయర్ పదవితో పాటు 62 డివిజన్లకు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు.అయితే, తొలిరోజు మేయర్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.మరోవైపు, 62 డివిజన్లకు సంబంధించి మొత్తం 16 నామినేషన్లు దాఖలయ్యాయి.

వీటిలో తెలుగుదేశం పార్టీ నుంచి 12 నామినేషన్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 4 నామినేషన్లు వచ్చాయి.డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. ఒకటో డివిజన్‌లో.. 3 నామినేషన్లు దాఖలయ్యాయి.ఇందులో టీడీపీ నుంచి ఒకటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు నామినేషన్లు వచ్చాయి.

అలాగే, నాలుగో డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నామినేషన్, 9, 13, 22, 30, 34, 41, 43, 49, 50, 52, 61వ డివిజన్లలో టీడీపీ నుంచి ఒక్కో నామినేషన్ దాఖలైంది. 37వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నామినేషన్ వచ్చింది.మొత్తంగా తొలిరోజు టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల నుంచే నామినేషన్లు దాఖలయ్యాయి.ఇతర పార్టీల నుంచి ఎలాంటి నామినేషన్లు సమర్పించలేదు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM