Anantapur: స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం: మంత్రులు
Anantapur: స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని, అనంతపురం మేయర్ అభ్యర్థి అజేష్ బాబును గెలిపించాలని మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ పిలుపునిచ్చారు.
Anantapur: స్థానిక ఎన్నికల్లో కూటమిదే విజయం: మంత్రులు
అనంతపురం: వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని అనంతపురం జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీజీ భరత్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలోని పాతూరు అమ్మవారిశాల సమావేశ భవనంలో ఆర్యవైశ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.
అనంతపురం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తమకు మంచి అవకాశాన్ని కల్పించాలని కోరారు.కూటమి బలపరిచిన బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబుతో పాటు 62 డివిజన్లలో పోటీ చేస్తున్న కూటమి కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో వైసీపీకి బలమున్న ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతూ ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని మంత్రులు ఆరోపించారు.
ఓటమి భయంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.గతంలో వైసీపీ పాలనలో జరిగిన పరిణామాలతో ప్రజలు విసిగిపోయారని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని 11 స్థానాలకే పరిమితం చేశారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే భయం వైసీపీలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఇప్పటికే రాష్ట్రంలో 150 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రులు తెలిపారు.నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.




