Anantapur: బీసీలకు 34% రిజర్వేషన్లు అనంతపురంలో కూటమి నేతల భారీ ర్యాలీ!
Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్,ర్యాలీ నిర్వహించారు.
Anantapur: బీసీలకు 34% రిజర్వేషన్లు అనంతపురంలో కూటమి నేతల భారీ ర్యాలీ!
Anantapur: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై అనంతపురం నగరంలో కూటమి నేతలు ర్యాలీ నిర్వహించారు.అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రామాదేవి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని, ఆయన తీసుకొచ్చిన 20 శాతం రిజర్వేషన్లను 1995లో చంద్రబాబు నాయుడు 34 శాతానికి పెంచారని గుర్తుచేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి, సుమారు 11 వేల మంది బీసీలకు రాజకీయ పదవులు దూరం చేసిందని విమర్శించారు.
హైకోర్టు, సుప్రీంకోర్టుల ద్వారా 34 శాతం రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు సృష్టించినా, కూటమి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ న్యాయపరమైన అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నించినప్పటికీ, చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం ప్రాతినిధ్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.బీసీలకు రాజకీయ, సామాజిక ప్రాధాన్యత కల్పించే విషయంలో వైసీపీ వైఖరిని ప్రజలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిప్పికొడతారని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు.




