Guntakal: రైతులు, విద్యార్థులను ఆదుకోవాలి గుంతకల్లులో ఏఐఎస్ఎఫ్ వినతి!

Guntakal: గుంతకల్లులో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, విద్యార్థులకు కరువు స్కాలర్‌షిప్‌లు అందించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఓకు వినతిపత్రం అందజేత.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 29 Sept 2026 12:57 PM IST
Guntakal
X

Guntakal: రైతులు, విద్యార్థులను ఆదుకోవాలి గుంతకల్లులో ఏఐఎస్ఎఫ్ వినతి!

Guntakal: ఎలినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ డిమాండ్ చేశారు. రైతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గుంతకల్లు ఏఓ నాగభూషణం సార్‌కు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వెంకట్ నాయక్ మాట్లాడుతూ ఎలినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే గుర్తించి, పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకు తగిన పరిహారం అందించడంతో పాటు, పంటల నష్టంతో అప్పుల భారంలో ఉన్న రైతులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ట్యూషన్ ఫీజులు, ఇతర ఫీజులు వసూలు చేస్తున్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల విద్యార్థులపై ఫీజుల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, అనవసరమైన అదనపు ఫీజులు వసూలు చేయకుండా విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ ప్రత్యేకంగా కరువు స్కాలర్‌షిప్ మంజూరు చేసి, సకాలంలో అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షలు, కార్యదర్శులు స్వేంతన్, షాహిర్, పట్టణ నాయకులు మహేష్, రాజశేఖర్, డేవిడ్, చిన్న, వంశీ తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL