Anantapur: అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వీల్‌చైర్లు అందజేసిన అహుడా ఛైర్మన్!

Anantapur: అనంతపురం సర్వజన ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం 20 వీల్‌చైర్లు పంపిణీ చేసిన అహుడా ఛైర్మన్ వరుణ్. మహిళల టాయిలెట్ల నిర్మాణంపై ప్రకటన.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 9 Oct 2026 2:11 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వీల్‌చైర్లు అందజేసిన అహుడా ఛైర్మన్!

Anantapur: అనంతపురం సర్వజన ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అహుడా (AHUDA) ఛైర్మన్ వరుణ్ పది వీల్‌చైర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన డిస్కవరీ అనిల్ కృషిని అభినందించారు.ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ తరఫున తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చామని వరుణ్ స్పష్టం చేశారు.డిస్కవరీ అనిల్ నిన్న వ్యక్తిగతంగా సుమారు 25 వీల్‌చైర్లను విరాళంగా అందించడం చాలా అభినందనీయమని పేర్కొంటూ, అనంతపురం ప్రజల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అహుడా ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే అనంతపురం నగరంలో మహిళల కోసం ప్రత్యేకంగా టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వరుణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద నిధులతో టాయిలెట్ల నిర్మాణానికి స్థలాల ఎంపిక ఇప్పటికే పూర్తయింది.అధికారుల సహకారంతో టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.ఇచ్చిన మాట ప్రకారం మహిళల కోసం టాయిలెట్ల నిర్మాణాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని వరుణ్ స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM