Dharmavaram: ధర్మవరం పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రవిచంద్రిక!

Dharmavaram: ధర్మవరం పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అడ్వకేట్ డి. రవిచంద్రిక ఎంపికయ్యారు. అంబటి సతీష్, జింక చంద్రశేఖర్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేత.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 14 Oct 2026 5:24 PM IST
Dharmavaram
X

Dharmavaram: ధర్మవరం పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రవిచంద్రిక!

ధర్మవరం: ధర్మవరం పట్టణ బీజేపీ మహిళా మోర్చా కమిటీ అధ్యక్షురాలుగా పట్టణానికి చెందిన అడ్వకేట్ డి.రవిచంద్రిక ను ఎన్నుకున్నారు.బీజేపీ సీనియర్ నాయకులు జాతీయ కౌన్సిల్ మెంబర్ అంబటి సతీష్, పట్టణ బీజేపీ అధ్యక్షులు జింక చంద్రశేఖర్,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జగ్గ నాగరత్నమ్మ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.

తన ఎన్నికకు సహకరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్,మంత్రి కార్యాలయ ఇంచార్జ్ కె. హరీష్ బాబు కు రవిచంద్రిక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిళ్ళే చంద్ర,ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనిల్ గౌడ్,జిల్లా జనరల్ సెక్రెటరీ నబి రసూల్, బండ్లపల్లి రాజు, మంజుల బాయి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM