Anantapur: అనంతపురం అభివృద్ధికి బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్‌ను గెలిపించండి!
Anantapur: అనంతపురం నగర అభివృద్ధి వేగవంతం కావాలంటే బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌ను గెలిపించాలని సినీ నటుడు, బీజేపీ నేత సాయికుమార్ కోరారు.
Anantapur: అనంతపురం అభివృద్ధికి బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్‌ను గెలిపించండి!
Anantapur: అనంతపురం నగరంలో బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ యాదవ్‌ను గెలిపిస్తే.. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సినీనటుడు, బీజేపీ సీనియర్ నాయకుడు సాయికుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయానికి మంత్రి సత్యకుమార్‌తో కలిసి సాయికుమార్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో పాటు టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.అనంతరం టీడీపీ నాయకులతో సమావేశమైన సాయికుమార్.. నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు.
ఇక్కడి ప్రజలు మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. గతంలో అనంతపురం జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించానని.. అనేక చోట్ల పార్టీ మంచి విజయాలు సాధించిందని తెలిపారు. ప్రస్తుతం అనంతపురం నగరంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, ఈ అభివృద్ధి మరింత ముందుకు వెళ్లాలంటే బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. అజేష్ యాదవ్‌ను గెలిపిస్తే అనంతపురం నగరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంటుందని అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలని కోరారు.నగర అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




