Dharmavaram: డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించిన నూతన కౌన్సిలర్ మేకల లోకేష్!

Dharmavaram: ధర్మవరం 4వ వార్డులో రోడ్డుపైకి వస్తున్న మురుగునీటి సమస్యపై తక్షణమే స్పందించిన నూతన టీడీపీ కౌన్సిలర్ మేకల లోకేష్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించి పరిష్కరించారు.

NAGENDRA, DHARMAVARAM
Published on: 10 Nov 2026 11:10 AM IST
Dharmavaram
X

Dharmavaram: డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించిన నూతన కౌన్సిలర్ మేకల లోకేష్!

Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలోని 4 వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన కౌన్సిలర్ మేకల లోకేష్ ప్రమాణ స్వీకారం కాకనే ప్రజా సమస్యలపై దృష్టి సారించారు.

4 వ వార్డులో డ్రైనేజీ కాలువలు చెత్త చెదారంతో నిండి మురుగునీరు రోడ్డుపైకి వస్తోందని ప్రజలు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన లోకేష్ పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి డ్రైనేజీ కాలువల్లో చెత్తను తొలగింప చేశారు.

ఈ సందర్భంగా నూతన కౌన్సిలర్ లోకేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో టీడీపీ టికెట్ ఇచ్చిన పరిటాల శ్రీరామ్ అదేవిధంగా గెలిపించిన వార్డు ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. వార్డు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిత్యం అందుబాటులో ఉంటానని లోకేష్ వెల్లడించారు.

NAGENDRA, DHARMAVARAM

NAGENDRA, DHARMAVARAM