Kadiri: వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన 300 మైనార్టీ కుటుంబాలు!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్సార్‌సీపీని వీడి సుమారు 300 ముస్లిం మైనార్టీ కుటుంబాలు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి.
Kadiri: వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరిన 300 మైనార్టీ కుటుంబాలు!
Kadiri: సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాం వలి కాలనీకి చెందిన పాత 15వ వార్డు, ప్రస్తుతం నూతన 18వ వార్డుకు చెందిన సుమారు 300 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
15వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ హైదర్ అలీ ఆధ్వర్యంలో ఈ భారీ చేరికల కార్యక్రమం కదిరి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 300 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన ఖాజా, బాబా ఫక్రుద్దీన్, అలీ, బాబు, సిరాజ్, ఇమామ్ సాబ్, మహమ్మద్, మొయినుద్దీన్, అస్లాం, ముబారక్, ఇర్ఫాన్, బాబ్జాన్, స్టోర్ మహాభాష తదితరులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మైనార్టీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు, కదిరి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తామని పేర్కొన్నారు.
15వ వార్డు ఇంచార్జ్ హైదర్ అలీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద సంఖ్యలో మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు, వార్డు నాయకులు, నూతనంగా పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.




