AP Municipal Elections: కూటమి తొలి విజయం.. వైసీపీ కౌన్సిలర్ల షాకింగ్ ట్విస్ట్..!

AP Municipal Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

Gagan kumar
Published on: 19 Oct 2026 8:55 AM IST
AP Municipal Elections
X

AP Municipal Elections: కూటమి తొలి విజయం.. వైసీపీ కౌన్సిలర్ల షాకింగ్ ట్విస్ట్..!

AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో అధికార కూటమి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం, ఆందోళనల మధ్య నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయకుండానే వెనుదిరగడంతో.. దర్శి మున్సిపల్ పీఠాన్ని కూటమి పార్టీ లీడర్లు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు.

దర్శి మున్సిపాలిటీ పరిధిలోని 25 మంది వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమైనప్పటికీ, తీవ్ర ఉద్రిక్తతలు , సాంకేతిక కారణాల వల్ల సమయానికి నామినేషన్ కేంద్రాలకు చేరుకోలేకపోయారు.

నామినేషన్ల స్వీకరణకు కేటాయించిన నిర్ణీత గడువు సమయం ముగిసిపోవడంతో అధికారులు నామినేషన్లను స్వీకరించడానికి నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక 25 మంది వైసీపీ అభ్యర్థులు తీవ్ర నిరాశ, నిస్పృహలతో వెనుదిరిగాల్సి వచ్చింది. ఫలితంగా ఎలాంటి పోటీ లేకుండానే దర్శి మున్సిపాలిటీని కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుని, ఈ ఎన్నికల సీజన్లో తొలి బోణీ కొట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలు, ఆందోళనలు, సవాల్-ప్రతిసవాళ్ల మధ్య పూర్తయింది. పలు నియోజకవర్గాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

తొలి రోజే దర్శి మున్సిపాలిటీ కూటమి ఖాతాలో పడటంతో, నామినేషన్ల ఉపసంహరణ మరియు పరిశీలన ప్రక్రియ పూర్తయ్యేసరికి మరికొన్ని పురపాలక సంఘాలు కూడా కూటమి వశమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏకగ్రీవ విజయం అధికార కూటమి శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, ప్రతిపక్ష వైసీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.