Amaravati: రేపు ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన!
Amaravati: రేపు ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. విజయవాడలో మిషన్ కర్మయోగి వర్క్‌షాప్, నెల్లూరులో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
Amaravati: రేపు ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన!
Amaravati: సీఎం చంద్రబాబు రేపు ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం విజయవాడ స్వరాజ్ మైదాన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగే మిషన్ కర్మయోగి ప్రాంతీయ వర్క్‌షాప్‌కు సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా రామాపురానికి చేరుకుంటారు.
అక్కడ కాకోల్లువారిపల్లిలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉపాధి హామీ కూలీలతో కలిసి శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రామాపురంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ముఖ్యమంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.




