Amaravati: సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం!

Amaravati: ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 4 Oct 2026 10:54 AM IST
Amaravati
X

Amaravati: సింగీతం శ్రీనివాసరావు మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం!

Amaravati: ప్రముఖ సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించిన సింగీతం శ్రీనివాసరావు తెలుగు సినీ పరిశ్రమకు తనదైన శైలిలో విశిష్ట సేవలందించారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వెండితెరపై ఆయన చేసిన అనేక ప్రయోగాలు ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయని తెలిపారు.

విభిన్నమైన కథలు, వినూత్నమైన ఆలోచనలతో సినిమాలను తెరకెక్కిస్తూ సింగీతం శ్రీనివాసరావు సినీ రంగానికి దిక్సూచిగా నిలిచారని చంద్రబాబు కొనియాడారు. దర్శకుడిగా ఆయన అందించిన చిత్రాలు, చేసిన ప్రయోగాలు భవిష్యత్ తరాల సినీ ప్రముఖులకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

సింగీతం శ్రీనివాసరావు భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన సృష్టించిన చిత్రాలు, సినీ ప్రయోగాల ద్వారా సినీ ప్రేమికుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం పేర్కొన్నారు.

సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.