Amaravati: ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అపూర్వ విజయం!

Amaravati: ఆసియా క్రీడల్లో 44 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు సీఎం చంద్రబాబు నాయుడు ఘన అభినందనలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 3 Oct 2026 12:06 PM IST
Amaravati
X

Amaravati: ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అపూర్వ విజయం!

Amaravati: ఆసియా క్రీడల్లో 44 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.

చైనా జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో 1-0 తేడాతో విజయం సాధించి భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించడం గర్వకారణమని పేర్కొన్నారు. అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టు దేశానికి స్వర్ణ పతకాన్ని అందించిందని తెలిపారు.

మ్యాచ్‌లో లాల్‌రెమ్సియామి సాధించిన నిర్ణయాత్మక గోల్‌ భారత విజయానికి కీలకంగా నిలిచిందని, కెప్టెన్ సలీమా టేటే నాయకత్వంలో మొత్తం జట్టు సమష్టి ప్రదర్శన అభినందనీయమని సీఎం పేర్కొన్నారు.

చైనా నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైనప్పటికీ భారత రక్షణ శ్రేణి చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడం జట్టు పట్టుదలకు నిదర్శనమన్నారు. గోల్‌కీపర్ సవితా పునియా కీలక సమయంలో పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోవడం కూడా విజయానికి కీలక ఘట్టంగా నిలిచిందని తెలిపారు.

44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా క్రీడల మహిళల హాకీ స్వర్ణాన్ని భారత్ తిరిగి సాధించడం చారిత్రాత్మక విజయమని సీఎం పేర్కొన్నారు. ఈ విజయంతో 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు భారత్ నేరుగా అర్హత సాధించడం మరింత ప్రత్యేకమని అన్నారు.

కెప్టెన్ సలీమా టేటే, లాల్‌రెమ్సియామి, దీపిక, సవితా పునియాతో పాటు జట్టులోని ప్రతి క్రీడాకారిణి, కోచ్‌లు, సహాయక సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.

భారత మహిళల హాకీ జట్టు విజయం దేశంలోని యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, అంతర్జాతీయ వేదికలపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. భారత మహిళల హాకీ జట్టు సాధించిన ఈ చారిత్రాత్మక స్వర్ణ విజయంతో దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.