Amaravati: 'మురుసు' తుపాను ముప్పు..విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్!

Amaravati: మురుసు తుపాను హెచ్చరికలతో ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Nov 2026 11:36 AM IST
Amaravati
X

Amaravati: 'మురుసు' తుపాను ముప్పు..విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్!

Amaravati: గొట్టిపాటి రవి కుమార్, విద్యుత్ శాఖ మంత్రి. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ టెలికాన్ఫరెన్స్టె లికాన్ఫరెన్స్ కు హాజరైన మూడు డిస్కంల సీఎండీలు, డైరెక్టర్లు. తుపాను మురసు సన్నద్ధతపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి.

స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కేబుల్స్, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 48 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సిబ్బందిని సిధ్దం చేసుకోవాలని సూచించిన మంత్రి గొట్టిపాటి.

తెలంగాణ, తమిళనాడు నుంచి అదనపు సిబ్బందిని, యంత్రాలను రప్పించేందుకు సిధ్ధమన్న మంత్రి. తుపాను తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని సీఎండీలు సూచన. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎండీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశం.

రెవెన్యూ, సచివాలయం, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలి మంత్రి ఆదేశం. ప్రాణ, ఆస్తి నష్టాలు వీలైనంత వరకు తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. 1912 కాల్ సెంటర్ ను 24 గంటలు అందుబాటులో ఉంచాలని సీఎండీని ఆదేశించిన మంత్రి గొట్టిపాటి.

అనంతరం అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులపై ఆరా తీసిన మంత్రి. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆదేశం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్