మిగిలిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..పేర్లు ప్రకటించిన పీవీఎన్ మాధవ్...

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పొత్తులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 Nov 2026 6:49 PM IST
Amaravati
X

మిగిలిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన..పేర్లు ప్రకటించిన పీవీఎన్ మాధవ్...

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ముందుగానే జరిగిన అభ్యర్థుల ఎంపిక, స్థానాల కేటాయింపు కు అనుగుణంగా ఈ జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కూటమి నేతల మధ్య జరిగిన చర్చల మేరకు బీజేపీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించారు.

మిగిలిపోయిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు కావలి, బాపట్ల మున్సిపాలిటీలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

ఖరారైన అభ్యర్థుల వివరాలు:

మున్సిపల్ కార్పొరేషన్..

*రాజమహేంద్రవరం – రిలంగి శ్రీదేవి*..

*మున్సిపాలిటీలు*..

* కావలి – గుండ్లపల్లి భరత్ కుమార్*..

* బాపట్ల – ఇస్కా సునీల్ కుమార్*..

కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టడం ఈ ప్రకటనలో కీలకంగా మారింది. ఎన్నికల బరిలో భాగస్వామ్య పక్షాల మధ్య పోటీ లేకుండా, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ముందస్తు చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ చర్చల్లో కూటమి నేతలు స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలాబలాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది.

ఆ చర్చల అనంతరం బీజేపీకి కేటాయించిన స్థానాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రకటనతో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చింది.

మరోవైపు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్థానికంగా ప్రజాబలం, పార్టీ క్యాడర్ మద్దతు, అభ్యర్థుల సామర్థ్యం ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.