Penchikalpet: కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం..బైక్ అదుపుతప్పి యువకుడు మృతి!

Penchikalpet: పెంచికల్‌పేట్ మండలం కల్వడ-శాలిగాం మధ్య బైక్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఎల్కపల్లికి చెందిన యువకుడు శ్రావణ్ మృతి.

SRINIVAS, KOUTALA
Published on: 23 Sept 2026 5:22 PM IST
Penchikalpet
X

Penchikalpet: కొమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం..బైక్ అదుపుతప్పి యువకుడు మృతి!

Penchikalpet: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కల్వడ శాలిగాం గ్రామాల మధ్య రహదారిపై విషాదం చోటుచేసుకుంది.

బైక్ అదుపుతప్పి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఎల్కపల్లి గ్రామానికి చెందిన నల్లగొండ శ్రావణ్ గా గుర్తించారు.

శ్రావణ్ బైక్ పై వెళ్తుండగా కల్వడ శాలిగాం మధ్య మార్గంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలపాలైన శ్రావణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రావణ్ మృతితో ఎల్కపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA