Nirmal: నిర్మల్ ఎమ్మార్వో కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

Nirmal: నిర్మల్ ఎమ్మార్వో కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం. భూ విక్రయ లావాదేవీల్లో అవకతవకలే కారణమని కుటుంబ సభ్యుల ఆవేదన, ఆసుపత్రిలో చికిత్స.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 26 Nov 2026 12:57 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ ఎమ్మార్వో కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఓ మహిళ ఫ్లోర్ క్లీనింగ్ కు ఉపయోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేటకు చెందిన జుమ్మెరత్ లావణ్య తనకు సంబంధించిన ఏడు గుంటల భూమిని ఒక వ్యక్తికి విక్రయించింది.

విక్రయం అనంతరం లావాదేవీల్లో ఏర్పడ్డ అవకతవకలతోనే ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

భూమికి సంబంధించిన వివాదంలో తన కుటుంబానికి అన్యాయం చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ మహిళను హుటాహుటిన జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL