Adilabad: వన్యప్రాణుల వేటగాడు షోయబ్ అఫ్జల్ అరెస్ట్.. ఎస్పీ వెల్లడి!
Adilabad: మహారాష్ట్ర అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్న ఆదిలాబాద్‌కు చెందిన షోయబ్ అఫ్జల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు. డబుల్ బ్యారల్ గన్, జింకల కొమ్ములు స్వాధీనం.
Adilabad: వన్యప్రాణుల వేటగాడు షోయబ్ అఫ్జల్ అరెస్ట్.. ఎస్పీ వెల్లడి!
Adilabad: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పంజేశా కాలనీలో ప్లంబర్ గా పని చేస్తూ జల్సా జీవితానికి అలవాటు పడ్డ షోయబ్ గత కొంతకాలంగా హైదరాబాద్ చెందిన ఆరుగురు తో కలిసి వన్యప్రాణులను వేటాడి హతమార్చేవారని తమకు అందిన సమాచారం మేరకు నిందితుడి షోయబ్ ఇంట్లో సోదాలు చేయగా ఓ డబుల్ బ్యారల్ తుపాకీ తోపాటు బుల్లెట్లు, కత్తులు, ఉలి, టార్చ్ లైట్లు, నల్లటి జాకెట్స్, జింకల కొమ్ములు, పుర్రెలు, ఇతర భాగాలు స్వాధీనం చేసుకున్నామని, ఈ ముఠా మహారాష్ట్రలోని ఘాటంజీ అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ను వేటాడి హతమార్చేవారని,
తుపాకీతో వేటాడిన అనంతరం వన్యప్రాణుల మాంసం, కొమ్ములు, ఇతర భాగాలను హైదరాబాద్ లో విక్రయించేవారని, నిందితుడు ఉపయోగించిన బైక్, ఫోన్ సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు, ఎస్పీ వెంట డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్టౌన్ సీఐ సునీల్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అడవి ప్రాణులను వేటాడి హతమార్చే వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని అన్నారు ఎస్పి.




