Gudihathnoor: కూతురి జ్ఞాపకార్థం తండ్రి గొప్ప మనసు.. తోషంలో రక్తదాన శిబిరం!

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన కోల నగేష్ తన కూతురు సహస్రిత జ్ఞాపకార్థం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.

NAGULA SATISH, BOATH
Published on: 16 Nov 2026 10:58 AM IST
Gudihathnoor
X

Gudihathnoor: కూతురి జ్ఞాపకార్థం తండ్రి గొప్ప మనసు.. తోషంలో రక్తదాన శిబిరం!

Gudihathnoor: మండలంలోని తోషం గ్రామానికి చెందిన కోల నగేష్ తన కూతురు కోల సహస్రిత జ్ఞాపకార్థం గ్రామంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు.

​గత ఏడాది సహస్రిత అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 25 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.

రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది హాజరై దాతల నుండి రక్తాన్ని సేకరించారు. తన కూతురి పేరుమీద ఏర్పాటు చేసిన ఈ సేవా కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం పట్ల కోల నగేష్ హర్షం వ్యక్తం చేస్తూ దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH