Adilabad: అదిలాబాద్‌లో అర్చక పురోహితుల బాక్స్ క్రికెట్
Adilabad: దేవీ నవరాత్రుల పూజల అనంతరం అదిలాబాద్ పట్టణంలో అర్చక పురోహితులు, బ్రాహ్మణ యూత్ సభ్యులు స్నేహపూర్వక బాక్స్ క్రికెట్ మ్యాచ్‌లతో అలరించారు.
Adilabad: అదిలాబాద్‌లో అర్చక పురోహితుల బాక్స్ క్రికెట్
Adilabad: తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రి ఉత్సవాల పూజలతో పాటు, ఇతర శుభకార్యాల్లో బిజీగా ఉండే అర్చక పురోహితులు కాసేపు ఆటవిడుపుగా క్రికెట్ బ్యాట్ పట్టి అదరగొట్టారు.. తాము వేదాల్లోనే కాదు బ్యాటు పడితే బాల్ బౌండరీకి వెళ్లాలని అంటున్నారు. అదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ యూత్ మరియు, BMM, అర్చక పౌరోహిత్య సభ్యులకు స్నేహ పూర్వక క్రికెట్ (Box క్రికెట్ )పోటీలను నిర్వహించారు.
దీనికి స్థానిక బ్రాహ్మణ సమాజ్ రామాలయం ప్రధానార్చకులు హరి విద్యాసాగర్ ముందుకు రావడం తో మిగతా పలువురు అర్చక పురోహితులు, ఇతర బ్రాహ్మణ యూత్ సభ్యులు, వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారు బాక్స్ క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్ పట్టిదిగారు... ఫ్రెండ్లీగా సాగిన ఈ మ్యాచ్లో పలువురు సభ్యులు పాల్గొన్నారు.




