Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 26 Oct 2026 1:15 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు!

Nirmal: నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి సంస్కృత సాహిత్యంలో ఆదికవిగా ప్రసిద్ధి చెందారని, ఆయన రచించిన రామాయణం ధర్మం, సత్యం, న్యాయం, మానవత్వం వంటి ఉన్నతమైన విలువలను సమాజానికి అందించిందని పేర్కొన్నారు.

రామాయణంలోని ఆదర్శాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని, మహర్షి వాల్మీకి సాహిత్య సేవలు చిరస్మరణీయమని తెలిపారు. మహర్షి వాల్మీకి జయంతి వేడుకల ముఖ్య ఉద్దేశం ఆయన జీవితాన్ని, సాహిత్య సేవలను స్మరించుకోవడంతో పాటు, ఆయన రచనల్లోని నైతిక విలువలను ప్రజలకు తెలియజేయడం.

ధర్మబద్ధమైన జీవనం, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో మంచి విలువలను పెంపొందించుకోవచ్చని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ అధికారి నర్సమ్మ, ఆర్‌ఐలు రామనిరంజన్, శేఖర్, రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, ఐటీ కోర్ సిబ్బంది, డీసీఆర్‌బీ సిబ్బంది, ఫింగర్‌ప్రింట్ సిబ్బంది, కమ్యూనికేషన్ సిబ్బంది, నిర్మల్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL