Utnoor: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Utnoor: ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు అధికారులను అప్రమత్తం చేశారు.

Y RAMESH, ITDA UTNOOR
Published on: 16 Nov 2026 5:08 PM IST
Utnoor
X

Utnoor: ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ఉట్నూర్: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు.

సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Y RAMESH, ITDA UTNOOR

Y RAMESH, ITDA UTNOOR