Bhainsa: భైంసాలో ఉప సర్పంచుల వినూత్న నిరసన.. మోకాళ్లపై కూర్చొని వినతి!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా మండలంలో ఉప సర్పంచులు అభివృద్ధి వేదిక సభ్యులతో కలిసి మోకాళ్లపై కూర్చొని ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.
Bhainsa: భైంసాలో ఉప సర్పంచుల వినూత్న నిరసన.. మోకాళ్లపై కూర్చొని వినతి!
Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా మండలంలో ఉప సర్పంచులు వినూత్న నిరసనకు దిగారు. అభివృద్ధి వేదిక సభ్యులతో కలిసి మోకాళ్లపై కూర్చొని మండల పరిషత్ అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు.
గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని, అభివృద్ధి వేదిక సూచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ప్రజాప్రతినిధులకు అవమానం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.




