Nirmal: నిర్మల్ జిల్లాలో ఆర్ఎంపీల దందా..పర్సంటేజీల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం!
Nirmal: నిర్మల్ జిల్లా గ్రామాల్లో ఆర్ఎంపీల దందా మితిమీరుతోంది. అర్హత లేకుండా క్లినిక్లు నడుపుతూ రోగుల నుంచి అధిక ఫీజులు, ప్రైవేట్ ఆసుపత్రుల నుండి కమిషన్లు దండుకుంటున్నారు.
Nirmal: నిర్మల్ జిల్లాలో ఆర్ఎంపీల దందా..పర్సంటేజీల కోసం రోగుల ప్రాణాలతో చెలగాటం!
Nirmal: నిర్మల్ జిల్లా గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఎలాంటి వైద్య అర్హత లేకుండానే పట్టణాల నుండి మందులు తెచ్చుకుని గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.
జ్వరం, జలుబు అని వస్తే చాలు సెలైన్ (హై డోస్) ఎక్కించడం, అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడం చేస్తున్నారు. దీనికి రూ. 500 నుండి రూ. 1000 వరకు ఫీజు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఎంబీబీఎస్ డాక్టర్లు రాయాల్సిన మందులను సైతం వీరే రాస్తుండటంతో పలువురు రోగులకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇటీవల పలు గ్రామంలో తప్పుడు ఇంజక్షన్ తో రోగి పరిస్థితి విషమించినట్లు సమాచారం.
మెడికల్ షాపులు, ల్యాబ్ లతో ఆర్ఎంపీల కమిషన్ దంద
గ్రామాల్లో ఆర్ఎంపీలు వైద్యం అందిస్తున్నామంటూ ల్యాబ్లు,మెడికల్ షాపుల యజమానుల నుండి కమిషన్ల రూపంలో డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రామాలలో జ్వరం వచ్చిందంటే చాలు వెంటనే ఎంబిబిఎస్ చేసిన డాక్టర్ రాసిచ్చినట్లు ల్యాబ్ టెస్టులు అవి వచ్చాక మెడికల్ షాపుల బోలెడు మందులను రాసి యజమానుల నుండి కమిషన్లను తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రవేట్ ఆసుపత్రులతో సాగుతున్న దందా...
పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభమైంది అంటే చాలు ఇక ఆర్ఎంపీలకు పండగే ప్రతి గ్రామంలోని ఆర్ఎంపి లతో ఆ ఆసుపత్రి యాజమాన్యం పర్సంటేజ్ దందా ఒప్పందం కుదుర్చుకొని ఆర్.ఎం.పి రిఫర్ చేసిన పేషెంట్ పై పర్సెంటేజ్ ఇస్తూ ఆర్ఎంపి పేరుమీద డబ్బులు సంబంధిత మెడికల్ షాపులో కవర్లో పేరు రాసి ఉంచుతారు. దీంతో ఆ గ్రామానికి చెందిన ఆర్.ఎం.పి ఆసుపత్రికి రోగిని తీసుకొచ్చినప్పుడు వెనువెంటనే కమిషన్ ఆర్ఎంపీకి ముట్ట చెప్పాల్సిందే.
ప్రైవేట్ యాజమాన్యాలు ఆర్ఎంపీకి పర్సంటేజ్ ఇవ్వకుంటే ఆ ఆసుపత్రికి పేషెంట్ ను తీసుకెళ్లారు. పర్సంటేజ్ ఇచ్చే ఆసుపత్రికే రోగిని తీసుకెళ్లి వైద్యం చేపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పర్యవేక్షణ లేని జిల్లా వైద్య అధికారులు.
ఇంత జరుగుతున్నా జిల్లాస్థాయి వైద్యాధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, తనిఖీలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వైద్యాధికారి స్పందించి గ్రామాల్లోని నకిలీ ఆర్ఎంపీల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




