Gudihathnoor: విద్యార్థుల భవితకు ఉల్లాస ట్రస్ట్ భరోసా – రూ. 30 వేల సాయం!

Gudihathnoor: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లోని మూడు ప్రభుత్వ పాఠశాలల 30 మంది ప్రతిభావంతులకు ఉల్లాస ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు.

NAGULA SATISH, BOATH
Published on: 16 Nov 2026 5:48 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: విద్యార్థుల భవితకు ఉల్లాస ట్రస్ట్ భరోసా – రూ. 30 వేల సాయం!

​గుడిహత్నూర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు 'ఉల్లాస ట్రస్ట్' ముందుకొచ్చింది. గుడిహత్నూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఆడే షీలా, మాజీ సర్పంచ్ రవి నాయక్, లింగాపూర్ మాజీ సర్పంచ్ జాడి సుభాష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడిహత్నూర్ మోడల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ మన్నూర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గుడిహత్నూర్ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న ప్రతిభావంతులను ఇందుకోసం ఎంపిక చేశారు.

​ఒక్కో పాఠశాల నుండి పది మంది చొప్పున మొత్తం 30 మంది విద్యార్థులకు, ఒక్కొక్కరికి రూ. 1,000 చొప్పున మొత్తం రూ. 30,000 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారిలో పోటీతత్వం పెరిగి, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉల్లాస ట్రస్ట్ ప్రతినిధి చంద్రకాంత్, ఆడే క్రాంతి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH