Adilabad: విద్యానగర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నలుగురి అరెస్ట్!

Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టూటౌన్ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 29 Oct 2026 6:58 AM IST
Adilabad
X

Adilabad: విద్యానగర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. నలుగురి అరెస్ట్!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా పట్టణంలోని విద్యానగర్‌లో ఓ అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టూటౌన్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు విద్యానగర్‌లోని ఒక అద్దె ఇంటిపై దాడి చేసినట్లు టూటౌన్ ఎస్ఐ ప్రణయ్ వెల్లడించారు.

ఈ దాడిలో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి,అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ఇక్కడ వ్యభిచారం సాగుతున్నట్లు స్థానికుల సమాచారంతోనే దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.