Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలపై TUWJ ఆధ్వర్యంలో నిరసన!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ TUWJ-IJU ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యలపై TUWJ ఆధ్వర్యంలో నిరసన!
Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం TUWJ–IJU జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్, వెంకన్నగారి భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యుడు గాండ్ల రాజశేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ప్రమోద్, జిల్లా నాయకులు ప్రశాంత్ వకలాభరణం, తక్కల్ల రవీందర్, వేణు, అశోక్, జిల్లా కమిటీ సభ్యులు, క్యూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.




