Asifabad: బెజ్జూర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. హైదరాబాద్కు నేరుగా బస్సు సర్వీసు!
Asifabad: బెజ్జూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్కు ఆర్టీసీ నేరుగా బస్సు సర్వీసును ప్రారంభించింది. ప్రతిరోజూ సాయంత్రం 7:39 గంటలకు ఈ బస్సు అందుబాటులో ఉంటుంది.
Asifabad: బెజ్జూర్ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.. హైదరాబాద్కు నేరుగా బస్సు సర్వీసు!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్కు బస్సు సర్వీసు ప్రారంభమైంది. బెజ్జూర్ మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బెజ్జూర్ మండల కేంద్రం నుండి హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు.
ఈ బస్సు సర్వీసు ప్రారంభంతో బెజ్జూర్ ప్రాంత ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులకు హైదరాబాద్ ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ వెళ్లాలంటే కాగజ్నగర్ లేదా ఆసిఫాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇకపై నేరుగా బెజ్జూర్ నుండే ప్రతి రోజూ సాయంత్రం 7గంటల 39 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉంటుంది.
ఈ సందర్భంగా బస్సును స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.




