Nirmal: నిర్మల్ జిల్లాలో పులి కలకలం - సుర్జాపూర్ అడవుల్లో అడుగుల గుర్తింపు!

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్, మామడ మండలాల సరిహద్దు అడవుల్లో పులి సంచారం. అటవీ ప్రాంతంలో అడుగులను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

RAKESH N, KHANAPUR
Published on: 29 Sept 2026 1:26 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో పులి కలకలం - సుర్జాపూర్ అడవుల్లో అడుగుల గుర్తింపు!

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్, మామడ మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటం కలకలం రేపుతోంది. నిన్న రాత్రి అటవీ ప్రాంతంలో పులి అడుగులను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో రాత్రి 7 గంటలకు గ్రామస్తులతో అటవీశాఖ బీట్ ఆఫీసర్ నరేందర్ సమావేశమయ్యారు.

రాత్రిపూట గాని పగలు అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదని గ్రామస్తులకు సూచించారు.ముఖ్యంగా మామడ మండలంలోని నల్దుర్తి గ్రామ సమీపంలోని భీమన్న ఆలయ కొండవైపు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువులను అడవిలోకి మేతకు తీసుకెళ్లవద్దని, ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని రైతులకు, కాపరులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

పులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ సిబ్బందిఅప్రమత్తమయ్యారు.సుర్జాపూర్, నల్దుర్తి పరిసర అడవుల్లో ట్రాకింగ్ ముమ్మరం చేశారు. పులి కదలికలపై నిఘా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులి జాడ కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR